దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సీజేఐ

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగబద్దమైనదిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తప్పుబట్టారు. దేశం క్లిష్ట పరిస్థుతులను ఎదుర్కొంటున్నప్పుడు సుప్రీం కోర్టులో దాఖలయ్యే పిటిషన్లు

Published : 09 Jan 2020 14:49 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తప్పుబట్టారు. దేశం క్లిష్ట పరిస్థుతులను ఎదుర్కొంటున్నప్పుడు సుప్రీం కోర్టులో దాఖలయ్యే పిటిషన్లు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసేవిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగానీ, రాజ్యాంగం చట్టబద్ధతను అనుమానించేవిగా ఉండకూడదని హితవు పలికారు. ఇలాంటి పిటిషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని అన్నారు.

సీఏఏని రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకంటించి, అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ వినీత్‌ ధండా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణకు జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. పౌరసత్వ చట్టంపై దేశంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. చట్టం చెల్లుబాటును నిర్ధారించడం కోర్టు విధి అని, అంతేగానీ అది రాజ్యాంగబద్ధమైందని తాము ప్రకటించలేమని ధర్మాసనం పేర్కొంది. 

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్‌లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి డిసెంబరు 2019లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చట్టంతో ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరని ప్రభుత్వం చెబుతూనే ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని