ఈ ఏడాది 6 గ్రహణాలు

ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు సంభవించనున్నాయి. ఇందులో నాలుగు చంద్ర గహణాలు కాగా.. రెండు సూర్య గ్రహణాలు. వీటిలో మూడు మాత్రమే భారత్‌లో కన్పించనున్నట్లు ఉజ్జయినిలోని జీవాజీ అబ్జర్వేటరీ

Published : 09 Jan 2020 18:35 IST

భారత్‌లో కన్పించనున్న మూడు

ఇండోర్‌: ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు సంభవించనున్నాయి. ఇందులో నాలుగు చంద్ర గహణాలు కాగా.. రెండు సూర్య గ్రహణాలు. వీటిలో మూడు మాత్రమే భారత్‌లో కన్పించనున్నట్లు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయనకేంద్రం సూపరిండెంట్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రకాశ్‌ గుప్తా తెలిపారు. 

ఇక ఈ ఏడాదిలో తొలి గ్రహణం రేపే సంభవించనుంది. జనవరి 10-11 మధ్యరాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. శుక్రవారం రాత్రి 10.36 గంటలకు గ్రహణం మొదలై 2.44 గంటల వరకు ఉంటుందని గుప్తా వెల్లడించారు. భారత్‌లో ఇది పాక్షికంగా కన్పించనుంది. ఆ తర్వాత జూన్‌ 5-6 మధ్య మరోసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మన దేశంలో పూర్తిగా కన్పిస్తుందని గుప్తా తెలిపారు. 

జులై 5, నవంబరు 30న కూడా చంద్రగ్రహణాలు సంభవించనున్నాయని అయితే వాటి ప్రభావం భారత్‌లో ఉండబోదని చెప్పారు. ఇక జూన్‌ 21న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం భారత్‌లో కన్పించనుందట. డిసెంబరు 14న సంపూర్ణ సూర్యగ్రహణం ఉందని, కానీ భారత్‌లో కన్పించదని గుప్తా వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని