జేఎన్‌యూ విద్యార్థుల ర్యాలీ భగ్నం

దిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఈనెల 5న జరిగిన ఘటనను నిరసిస్తూ దిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతంగా మారింది. రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. జేఎన్‌యూ ఉపకులపతిని వెంటనే తొలగించాల్సిందిగా

Updated : 09 Jan 2020 19:30 IST

దిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఈనెల 5న జరిగిన ఘటనను నిరసిస్తూ దిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతంగా మారింది. రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. జేఎన్‌యూ ఉపకులపతిని వెంటనే తొలగించాల్సిందిగా విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖతో విద్యార్థి సంఘాలు భేటీ అయ్యాయి. జేఎన్‌యూ వీసీని తొలగించేందుకు విద్యార్థి సంఘాలు కోరగా అందుకు హెచ్‌ఆర్‌డీ నిరాకరించింది. దీంతో ఆయన్ను తొలగించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను నిలువరించే ప్రయత్నంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

గత ఆదివారం జేఎన్‌యూలోకి ముసుగులతో ప్రవేశించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులు, అధ్యాపకులపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో సుమారు 30 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. జేఎన్‌యూ ఘటనను పలువురు ప్రముఖులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని