జేఎన్‌యూ హింస: వీసీకి హెచ్‌ఆర్డీ సమన్లు

దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మానవ వనరుల అభివృధ్ధి శాఖ(హెచ్‌ఆర్డీ) వర్సిటీ వీసీ జగదీశ్‌ కుమార్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఉదయం 11.30

Updated : 23 Dec 2022 12:32 IST

దిల్లీ: దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మానవ వనరుల అభివృధ్ధి శాఖ(హెచ్‌ఆర్డీ) వర్సిటీ వీసీ జగదీశ్‌ కుమార్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఉదయం 11.30 గంటలకు హెచ్‌ఆర్డీ సెక్రటరీతో జగదీశ్‌ సమావేశమవ్వాలని ఆదేశించింది. 

గత ఆదివారం జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ వీసీ జగదీశ్‌ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వీరి డిమాండ్‌ను హెచ్‌ఆర్డీ తోసిపుచ్చింది. వీసిని తొలగించడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. సమస్యకు కారణమైన ప్రధాన అంశాన్ని గుర్తించి దాన్ని పరిష్కరించాలని హెచ్‌ఆర్డీ సెక్రటరీ అమిత్ ఖరే అన్నారు. 

గత ఆదివారం సాయంత్రం జేఎన్‌యూ ప్రాంగంణంలోకి కొందరు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ సహా 34 మంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. విద్యార్థులకు మద్దతిస్తూ ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని