అది లెఫ్ట్‌ విద్యార్థుల పనే: జావడేకర్‌

జేఎన్‌యూలో జనవరి 5న జరిగిన దాడి వెనుక వామపక్ష విద్యార్థి సంఘం నాయకుల హస్తమున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. దాడి........

Published : 10 Jan 2020 21:50 IST

దిల్లీ: జేఎన్‌యూలో జనవరి 5న జరిగిన దాడి వెనుక వామపక్ష విద్యార్థి సంఘం నాయకుల హస్తమున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. దాడి ఘటనలో అనుమానితుల చిత్రాలను దిల్లీ పోలీసులు విడుదల చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, ఆప్‌ను ప్రజలు తిరస్కరించడంతో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఆందోళనలు మాని తరగతుల్లో పాల్గొనాలని సూచించారు. జేఎన్‌యూ దాడి వెనుక ఉన్నది వామపక్ష విద్యార్థులేనని పోలీసులు నిగ్గు తేల్చారని ఆయన అన్నారు.

జేఎన్‌యూలో ముసుగులో వచ్చిన కొందరు దుండగులు విద్యార్థులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాడి ఎవరు చేశారనేదానిపై వామపక్ష, ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమానితుల చిత్రాలను పోలీసుల శుక్రవారం విడుదల చేశారు. అందులో వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలు, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ పేరును పోలీసులు చేర్చారు. దీన్ని అయిషీ ఘోష్‌ ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని