భారత నేవీ మరో కీలక ముందడుగు..

భారత నేవీ శనివారం మరో కీలక సాహస ప్రక్రియను పూర్తి చేసింది. లైట్‌ కంబాట్‌ యుద్ధవిమానం(ఎన్‌)ఎంకే 1ను అతిపెద్ద యుద్ధ వాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్‌ చేసింది.

Published : 12 Jan 2020 00:48 IST

దిల్లీ: భారత నేవీ శనివారం మరో కీలక సాహస ప్రక్రియను పూర్తి చేసింది. తేజస్‌ లైట్‌ కంబాట్‌ యుద్ధవిమానం(ఎన్‌)ఎంకే 1ను అతిపెద్ద యుద్ధ వాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. అయితే ఇది భారత్‌ దేశీయంగా తయారు చేసిన తొలి ఎల్‌సీఏ కావడం విశేషం. భారత నేవీ కమోడర్ జైదీప్‌ మౌలాంకర్‌ ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా భారతీయ నేవీ అధికార ప్రతినిధి వివేక్‌ మద్వాల్‌ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా తీర ఆధారిత యుద్ధ కార్యకలాపాలకు దేశీయంగా తయారు చేసిన సాంకేతికతలు ఉపయోగపడతాయని నిరూపితమైందన్నారు. అంతేకాకుండా భారత నేవీ కోసం ట్విన్‌ ఇంజన్‌ యుద్ధ విమానాలు తయారు చేసేందుకూ మార్గం సుగమం అయిందని ఆయన పేర్కొన్నారు. 

ఈ ప్రయోగాన్ని ఇప్పటివరకు యూఎస్‌, రష్యా, యూకే, ఫ్రాన్స్‌, ఇటీవల చైనా ఈ దేశాల్లో తయారైన జెట్లతో మాత్రమే సాధించారు. కానీ ప్రస్తుతం భారత్‌ దేశీయంగా రూపొందించిన ఎల్‌సీఏ (ఎన్‌)తో విజయవంతంగా నిర్వహించడం విశేషం. ఈ తేజస్‌ను ఆధారంగా చేసుకుని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ భారీ తీర ఆధారిత యుద్ధవిమానాన్ని తయారుచేసేందుకు అంచనా వేస్తున్నట్లు సమాచారం.  

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని