9 సెకన్లు.. 128 ఫ్లాట్లు నేలమట్టం

నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన అపార్టుమెంట్ల కూల్చివేతలో భాగంగా కేరళలోని మరడు పురపాలక సంఘం పరిధిలో ఆదివారం మరో భారీ అపార్టుమెంటును నేలమట్టం చేశారు........

Updated : 12 Jan 2020 20:01 IST

కోచి: నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన అపార్టుమెంట్ల కూల్చివేతలో భాగంగా కేరళలోని మరడు పురపాలక సంఘం పరిధిలో ఆదివారం మరో భారీ అపార్టుమెంటును నేలమట్టం చేశారు. నాలుగు భవనాల్లో ఇదే పెద్దది కావడం విశేషం. 17 అంతస్తులున్న జైన్‌ కోరల్‌ కోవ్‌ అనే ఈ అపార్టుమెంటులో 128 ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నియంత్రిత అంతస్ఫోటన విధానం ద్వారా దీన్ని తొమ్మిది సెకన్లలో నేలకూల్చారు. 40 ఫ్లాట్లు ఉన్న గోల్డెన్‌ కయాలోరమ్‌ అనే మరో అపార్టుమెంటును మధ్యాహ్నం కూల్చారు.

శనివారం రెండు భారీ భవనాల్ని కూల్చిన విషయం తెలిసిందే. 60 మీ. ఎత్తుతో 19 అంతస్తులు ఉన్న హోలీ ఫెయిత్‌ హెచ్‌2ఓ అపార్టుమెంటును మొదట.. రెండు టవర్లుగా కనిపించే అల్ఫా సెరేన్‌ అపార్టుమెంటును ఆ తర్వాత క్షణాల వ్యవధిలో నేలమట్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని