మరోసారి దాడులకు పాల్పడ్డ ఇరాన్‌

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా స్థావరాలపై ఇరాన్‌ మరోసారి దాడులకు పాల్పడింది. ఇరాక్‌లోని బగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్‌ బలాద్‌ ఎయిర్‌బేస్‌పై రాకెట్లతో  

Published : 13 Jan 2020 01:16 IST

బాగ్దాద్‌: ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా స్థావరాలపై ఇరాన్‌ మరోసారి దాడులకు పాల్పడింది. ఇరాక్‌లోని బగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్‌ బలాద్‌ ఎయిర్‌బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. మొత్తం ఎనిమిది రాకెట్లు ఈ స్థావరాన్ని ఢీకొట్టినట్లు ఇరాక్‌ సైన్యం తెలపింది. ఈ దాడుల్లో నలుగురు గాయపడ్డట్లు పేర్కొంది. మొదట్లో ఇరాన్‌కు చెందిన సైనికాధికారిని అమెరికా హతం చేసింది. ఆ తర్వాత ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అమెరికాకు చెందిన ఏ ఒక్కరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. కాగా ఇరుదేశాలు పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఒకరికొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఒకడుగు ముందుకేసిన ఇరాన్‌.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తలపై 80మిలియన్ల డాలర్లు ప్రకటించింది. అంతే దీటుగా స్పందించిన ట్రంప్‌ సైతం.. ఇరాన్‌ తీరు మార్చుకోకపోతే అదే స్థాయిలో నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా ఆదివారం సైతం ట్విటర్‌ వేదికగా ఇరాన్‌ను హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ ట్విట్‌ చేసిన కాసేపటికే ఇరాన్‌ మరోసారి దాడులకు పాల్పడింది. అమెరికా కీలక స్థావరాల్లో అల్‌ బలాద్‌ ఒకటి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇరాక్‌ నుంచి తమ సైన్యాన్ని మొత్తం అక్కడి నుంచి వెళ్లినట్లు అమెరికా తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని