‘ఇరాన్‌తో యుద్ధం.. ప్రపంచానికి ప్రమాదం’

అమెరికా-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జపాన్‌ ప్రధాని షింజో అబే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సైనిక పోరాటం వల్ల కేవలం పశ్చిమాసియా ప్రాంతానికేగాక........

Published : 14 Jan 2020 00:50 IST

జపాన్‌ ప్రధాని షింజో అబే కీలక వ్యాఖ్యలు

రియాద్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జపాన్‌ ప్రధాని షింజో అబే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సైనిక పోరాటం వల్ల కేవలం పశ్చిమాసియా ప్రాంతానికేగాక.. యావత్తు ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. అంతర్జాతీయంగా శాంతి, సుస్థిరత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలన్న ఆకాంక్షతో ఐదు రోజుల గల్ఫ్‌ పర్యటన ప్రారంభించిన అబే ప్రస్తుతం సౌదీలో ఉన్నారు. ఇరాన్‌ కమాండర్‌ సులేమానీపై అమెరికా దాడి తరవాత నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అబే పర్యటన రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తొలుత భావించారు. కానీ, గత రెండు రోజులుగా పరిస్థితులు కాస్త సద్దుమణగడంతో ఆయన తన పర్యటనని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ఆదివారం భేటీ అయిన అబే.. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. ఉద్రిక్త పరిస్థితుల తగ్గింపునకు ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రతి దేశం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తీరప్రాంత రక్షణ వ్యవస్థ విషయంలో పశ్చిమాసియాతో కలిసి పనిచేసేందుకు అబే అంగీకరించారు. రెండు పీ-3సీ రకం గస్తీ విమానాలతో పాటు ఓ యుద్ధ నౌకను ఈ ప్రాంతంలో మోహరించాలన్న జపాన్‌ నిర్ణయాన్ని సౌదీ యువరాజుతో చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈ, ఒమన్‌లోనూ అబే పర్యటించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని