Published : 14/01/2020 00:51 IST

డ్రోన్ల ఆపరేటర్లూ.. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

దిల్లీ: భారత విమానయాన మంత్రిత్వశాఖ సివిల్‌ డ్రోన్ల ధ్రువీకరణ కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పథకాన్ని ప్రారంభించింది. జనవరి 31 వరకు ఆపరేటర్లందరూ తమంతట తాము ఈ వాలంటరీ రిజిస్ట్రేషన్‌ పథకం కింద డ్రోన్లను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఇరాన్‌ అగ్రశ్రేణి మేజర్‌ జనరల్‌ సులేమానీని అమెరికా దళాలు డ్రోన్ దాడితో హత్య చేసిన ఘటన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రిజిస్టర్‌ చేసుకోని వారిపై భారతీయ శిక్షా స్మృతి, విమానయాన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్‌ డ్రోన్లను, ఆపరేటర్లను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ అవకాశాన్ని కల్పించింది. డ్రోన్‌ వినియోగదారులందరూ జనవరి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి అని తెలిపింది. ఆన్‌లైన్‌లో ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసుకోవడం ద్వారా డ్రోన్‌ రసీదు సంఖ్య(డీఏఎన్‌), యాజమాన్య రసీదు సంఖ్య(ఓఏఎన్‌) పొందుతారు. ఈ నంబర్లు దేశంలోని డ్రోన్లను ధ్రువీకరించడానికి తోడ్పడతాయని పేర్కొంది.

దేశంలో దాదాపు 50వేల నుంచి 60వేల అక్రమ డ్రోన్లు ఉన్నట్లు ఫిక్కీ కమిటీ సహ వ్యవస్థాపకులు అంకిత్‌ మెహతా గతేడాది చెప్పారు. జనవరి 3వ తేదీన అమెరికా దళాలు డ్రోన్‌ సాయంతో ఇరాన్ మేజర్‌ జనరల్‌ సులేమానీని హత్య చేసింది. దీంతో భారత్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి అనుమతులు లేని డ్రోన్లపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఇప్పటికే డీజీసీఏ 2018 ఆగస్టు 27న భారత్‌లోని సివిల్‌ డ్రోన్ల నియంత్రణకు (సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్స్‌)సీఏఆర్‌ను జారీ చేసింది. దీని నిబంధనల కింద ఆపరేటర్లు ఏకీకృత గుర్తింపు నంబర్‌(యూఐఎన్‌) సహా ఇతర అనుమతులు తీసుకోవాలని సూచించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని