క్షమాభిక్ష పిటిషన్‌ వేసిన నిర్భయ దోషి

దిల్లీ: నిర్భయ అత్యాచారం హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని తిహార్‌ జైలు అధికారులు తెలిపారు. ముకేశ్‌ పెట్టుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించిన

Published : 15 Jan 2020 01:00 IST

దిల్లీ: నిర్భయ అత్యాచారం హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని తిహాడ్‌ జైలు అధికారులు తెలిపారు. ముకేశ్‌ పెట్టుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ఉన్న చిట్ట చివరి అవకాశంలో భాగంగా క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నట్లు  జైలు అధికారులు వెల్లడించారు. నిర్భయ దోషులకు ఈనెల 22న మరణశిక్ష విధించాలంటూ దిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. మరణశిక్షను సవాలు చేస్తూ వినయ్‌, ముకేశ్‌ సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ వేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది.

గతంలో వినయ్‌ శర్మ క్షమాభిక్ష కోసం దిల్లీ గవర్నర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ క్షమాభిక్షకు అతడు అర్హుడు కాదని దాన్ని తిరస్కరించాలంటూ దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం 22న ఉదయం ఏడు గంటలకు  జైల్లోని మూడో నంబరు గదిలో నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఉరితీతకు సంబంధించిన ట్రయల్స్‌ను జైలు అధికారులు నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని