దిల్లీ సమరానికి అభ్యర్థుల్ని ప్రకటించిన ఆప్‌

దిల్లీ శాసనసభ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. దిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు గానూ అన్ని స్థానాలకు కేజ్రీవాల్‌ ఆప్‌ అభ్యర్థులను ప్రకటించారు.

Updated : 15 Jan 2020 11:20 IST

దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. దిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు గానూ అన్ని స్థానాలకు కేజ్రీవాల్‌ ఆప్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఆ 70 మందిలో దాదాపు 46 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే మళ్లీ టిక్కెట్లు దక్కించుకున్నారు. 15 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పార్టీ పక్కన పెట్టినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఐదు మంది మహిళలకు అవకాశం కల్పించగా ఈసారి ఎనిమిది మందికి అవకాశం కల్పించినట్లు మనీష్‌ సిసోడియా తెలిపారు. పార్టీలో ముఖ్య నాయకులైన మనీష్‌ సిసోడియా ప్రతాప్‌గంజ్‌ నుంచి, సత్యేంద్ర జైన్‌ శాకూర్‌ బస్తీ స్థానంలో, జితేంద్ర తోమర్‌ త్రినగర్‌ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్లు పొందినట్లు తెలుస్తోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టికెట్లు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఆప్‌పై విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికల నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే.  ఈ ఎన్నికల్లో దాదాపు 1.46 కోట్ల మంది ఓటు హక్కు అర్హత పొందారని ఎన్నికల సంఘం తెలిపింది. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని