జోరుగా కొనసాగుతున్న జల్లికట్టు

మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మధురై జిల్లా అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలను తిలకించడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.......

Published : 16 Jan 2020 04:21 IST

చెన్నై: మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మధురై జిల్లా అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలను తిలకించడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిని అదుపుచేయడానికి 730 మంది ఔత్సాహికులు నమోదు చేసుకున్నారు. అవనియాపురంలో ఉదయం 8గంటలకే పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ న్యాయమూర్తి జెమికం, మధురై మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పోటీలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటికే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రప్రజలంతా ఈ పోటీలను వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అందుబాటులో ఉంచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని