రష్యా మంత్రివర్గం రాజీనామా
రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా మంత్రిమండలి రాజీనామా చేసింది. ఈ మేరకు రష్యాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
మాస్కో: రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా మంత్రిమండలి రాజీనామా చేసింది. ఈ మేరకు రష్యాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రష్యా ప్రధాని మెడ్వెడెవ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనలు దేశ అధికార సమతుల్యతలో పలు మార్పులను చేస్తాయని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రిమండలి రాజీనామా చేసింది అన్నారు. మార్పులు చేపట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే అవకాశాన్ని అధ్యక్షుడికి కల్పించాలని అన్నారు. తదుపరి నిర్ణయాలన్నీ అధ్యక్షుడే తీసుకుంటారన్నారు. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ.. ఇందు కోసం సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మెడ్వెడెవ్ను బాధ్యతలు తీసుకోమని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్