సెనేట్‌కు చేరిన ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​అభిశంసన ప్రక్రియ అక్కడి పెద్దల సభ సెనేట్‌కు చేరింది.​ అభిశంసన విచారణను సెనేట్‌కు పంపే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది......

Updated : 16 Jan 2020 13:27 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసన ప్రక్రియ అక్కడి పెద్దల సభ సెనేట్‌కు చేరింది.​ అభిశంసన విచారణను సెనేట్‌కు పంపే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జరిగిన ఓటింగ్‌లో 228 మంది సభ్యులకుగానూ 193 మంది ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటేశారు. వచ్చే వారం సెనేట్‌లో జరిగే అభిశంసన విచారణ కోసం స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రత్యేక న్యాయ మండలిని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్​కు చెందిన ఏడుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. ఈ ప్రత్యేక కమిటీకి నాయకత్వ బాధ్యతను కాంగ్రెస్‌ సభ్యుడు ఆడమ్ షిఫ్‌కు అప్పగించారు. అనంతరం అభిశంసన విచారణను సెనేట్‌కు పంపే రెండు తీర్మానాలపై పెలోసీ సంతకం చేశారు. అభిశంసన విచారణపై ఎలాంటి భయం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. విచారణను సమర్థంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. సెనేట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండడంతో అభింశంసన నుంచి గట్టెక్కుతానని ట్రంప్‌ ధీమాగా ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని