ఆర్మీ జవాన్ల తెగువకు మరోసారి నెటిజన్లు ఫిదా

భారీగా కురుస్తున్న మంచులో నిండు గర్భిణిని ఆర్మీ జవాన్లు మోసుకెళ్తున్న వీడియోను నిన్న ప్రధాని మోదీ షేర్ చేస్తూ వారిని సేవలను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మంచులో...

Published : 16 Jan 2020 16:13 IST

శ్రీనగర్‌: భారీగా కురుస్తున్న మంచులో నిండు గర్భిణిని ఆర్మీ జవాన్లు మోసుకెళ్తున్న వీడియోను నిన్న ప్రధాని మోదీ షేర్ చేస్తూ వారిని సేవలను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మంచులో కూరుకుపోయిన ఇద్దరు పౌరులను భారత ఆర్మీ జవాన్లు సురక్షితంగా కాపాడిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 14న జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో లచ్చిపుర గ్రామానికి చెందిన తారిక్‌ ఇక్బాల్,  జహూర్‌ అహ్మద్ ఖాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు లచ్చిపుర నుంచి బిజ్‌హమ గ్రామానికి వెళుతున్న సందర్భంలో వారిపై మంచు చరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటన లచ్చిపురలోని ఆర్మీ స్థావరానికి 200 మీటర్ల దూరంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ విధలు నిర్వహిస్తున్న ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని గమనించి వెంటనే రెస్క్యూ టీంతో అక్కడి చేరుకున్నారు. జహూర్‌ అహ్మద్ ఖాన్‌ సగం భాగం వరకు మంచులో ఉండంతో అతన్ని వెంటనే గుర్తించి సురక్షితంగా  కాపాడారు. తారిక్‌ ఇక్బాల్‌ పూర్తిగా మంచులో పూర్తిగా మంచులో కూరుకుపోవడంతో 20 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి అతణ్ని కాపాడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వారివురిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో జహూర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక్బాల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అతణ్ని బారాముల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ వీడియోని చూసిని నెటిజన్లు భారత జవాన్ల దైర్య సాహసాలను, సేవలను కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని