భారత్‌లో ద్రవ్యలోటు లేదు: గడ్కరీ

భారత్‌లో ద్రవ్యలోటు లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఈ ఏడాది మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాగపూర్‌లోని విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ...

Published : 20 Jan 2020 00:49 IST


కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ

దిల్లీ: భారత్‌లో ద్రవ్యలోటు లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఈ ఏడాది మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాగపూర్‌లోని విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఎన్‌ఐటీ) డైమండ్‌ జూబ్లీ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ గత 5 ఏళ్లలో నేను రూ.17 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చాను. ఈ ఏడాది మౌలిక సదుపాయాల కల్పన రంగంలో రూ.5 లక్షల కోట్ల పనులు చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని