సీఏఏనే కాదు..ఎన్‌పీఆర్‌ అమలు లేదు: కేరళ సీఎం

కొచ్చి: పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం తాజాగా.. జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)ను కూడా అమలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు

Published : 20 Jan 2020 12:54 IST

కొచ్చి: పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం తాజాగా.. జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)ను కూడా అమలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఎన్‌పీఆర్‌ అమలును వ్యతిరేకిస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను అమలు చెయ్యబోమనే విషయాన్ని జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌కు తెలియజేయనున్నట్లు పినరయి విజయన్‌ ప్రభుత్వం వెల్లడించింది. గత నిబంధనల ప్రకారమే జనాభా లెక్కలను సేకరిస్తామని తెలిపింది. 

ఇప్పటికే జనాభా లెక్కలు 2020 జాబితాలో ఎన్‌పీఆర్‌ను చేర్చకూడదంటూ కేరళ జనరల్‌ అడ్మినిస్ట్రేట్‌ డిపార్ట్‌మెంట్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సీఏఏను కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఏఏను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. నిన్న సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహ్మద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని