
భారత్‌ను ప్రతిఘటించలేము: మహతిర్
కౌలాలంపూర్: పామాయిల్ కొనుగోలు చేయకూడదంటూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము ప్రతిఘటించలేమని మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ అన్నారు. కశ్మీర్ అంశంపై దాయాది దేశం పాకిస్థాన్‌కు అనుకూలమైన రీతిలో వ్యవహరిస్తున్న మలేషియా నుంచి పామాయిల్ కొనుగోలు చేయకూడదని ముంబయిలోని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్(ఎన్‌ఈఏఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు.
‘మేం చాలా చిన్నవాళ్లం. భారత్ నిర్ణయాన్ని ప్రతిఘటించలేము. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా తర్వాత అతిపెద్ద పాయాయిల్ ఉత్పత్తిదారుగా దేశంగా మలేషియా ఉంది. గత ఐదేళ్లుగా భారత్ మలేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలు నిర్ణయం చాలా అన్యాయమని ఆయన పేర్కొన్నారు. లౌకిక దేశం అని చెప్పుకునే భారత్ ఇప్పుడు కొందరు ముస్లింల పౌరసత్వాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టడం బాధాకరమంటూ మహతిర్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు భారత విదేశాంగశాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ అంతర్గత వ్యవహరాల్లో మలేషియా జోక్యం చేసుకోవడం సరికాదని హితవు పలికింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.