నిత్యానందపై ఇంటర్‌పోల్‌ నోటీసు

వివాదాస్పద గురువు నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గుజరాత్‌ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. వారి అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న

Updated : 29 Jun 2023 16:41 IST

దిల్లీ: వివాదాస్పద గురువు నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గుజరాత్‌ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. వారి అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద గతేడాది భారత్‌ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానందకు చెందిన ఆశ్రమంలో అమ్మాయిలను అక్రమంగా నిర్బంధించి వారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు గతేడాది అతడిపై కర్ణాటకలో కేసు నమోదైంది. ఆ తర్వాతి నుంచి నిత్యానంత కన్పించకుండా పోయాడు. దీంతో బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసిన గుజరాత్‌ పోలీసులు అతడిని వాంటెడ్‌గా ప్రకటించాయి.  

ఇటీవల ఓ రహస్య ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈక్వెడార్‌ సమీపంలో తాను ఓ చిన్న దీవిని కొనుగోలు చేశానని, దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు నిత్యానంద ఆ వీడియోలో చెప్పాడు. ఈ దీవిని ప్రత్యేక హిందూ దేశంగా గుర్తించాలని పేర్కొన్నాడు. అయితే ఈ వార్తలను ఈక్వెడార్‌ దేశం కొట్టిపారేసింది. అంతేగాక నిత్యానంద తమ దేశంలో ఆశ్రయం కోరినట్లు వస్తున్న వార్తలను కూడా తోసిపుచ్చింది. ప్రస్తుతం నిత్యానంద తమ దేశంలో లేడని.. బహుశా హైతీ వెళ్లి ఉండొచ్చని ఈక్వెడార్‌ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని