అంతరిక్ష ప్రయాణానికి వ్యోమ్‌మిత్ర సిద్ధం

మొట్టమొదటి సారిగా హ్యుమనాయిడ్‌ ‘వ్యోమ్‌మిత్ర’ ను అంతరిక్షంలోకి పంపనున్నారు.

Updated : 22 Jan 2020 21:17 IST

గగనయాన్‌ అజెండాలో అంతర్‌ గ్రహ యాత్ర, అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కూడా

బెంగళూరు: భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సంబంధించిన విశేషాలను ఇస్రో చైర్మన్‌ కె శివన్‌ నేడు వెల్లడించారు. డిసెంబర్‌ 2021లో సాకారం కాగలదని ఆశిస్తున్న గగన్‌యాన్ కంటే ముందుగా రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలను చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఈ ప్రయోగాత్మక యాత్రలు డిసెంబర్‌ 2020, జూన్‌ 2021లో ఉంటాయని ఆయన అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లటం మాత్రమే కాకుండా అక్కడ ఒక కొత్త అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్‌ స్టేషన్‌) ఏర్పాటు చేయటం కూడా గగన్‌యాన్‌ లక్ష్యం అని ఇస్రో చైర్మన్‌ ప్రకటించారు. అంతేకాకుండా గగన్‌యాన్‌ దీర్ఘకాలిక అజెండాలో అంతర్‌ గ్రహ యానం కూడా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

డిసెంబర్‌ 2020 నాటి అంతరిక్ష యాత్రలో మొట్టమొదటి సారిగా హ్యుమనాయిడ్‌ ‘వ్యోమ్‌మిత్ర’ ను అంతరిక్షంలోకి పంపనున్నట్టు శివన్‌ వివరించారు. వ్యోమ్‌మిత్ర, మనిషి లాగే అనేక పనులను చేయగలదు... రెండు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. .గగన్‌యాన్‌లో పాల్గొనేందుకు నలుగురు వ్యోమగాములకు ఈ నెలాఖరులోగా రష్యాలో శిక్షణ ప్రారంభం కానుందని చెప్పారు. గగన్‌యాన్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి తరలించటానికి భారీ ప్రయోగ నౌక ‘బాహుబలి’ జీఎస్‌ఎల్‌వి మార్క్‌ 3ని ఉపయోగిస్తామని ఇస్రో చైర్మన్‌ తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని