దిల్లీ వీధుల్లో భారత్-పాక్‌ ఢీ: కపిల్‌ మిశ్రా

హస్తినలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు అధికార ఆమ్‌ఆద్మీ గెలుపుకోసం యత్నిస్తుండగా..  ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలని భాజపా ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణమే అయినప్పటికీ.. తాజాగా భాజపా నేత కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది...

Updated : 08 Dec 2022 15:45 IST

దిల్లీ: హస్తినలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓ వైపు అధికార ఆమ్‌ఆద్మీ గెలుపుకోసం యత్నిస్తుండగా..  ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలని భాజపా ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణమే అయినప్పటికీ.. తాజాగా భాజపా నేత కపిల్ మిశ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పోలింగ్‌ తేదీని ప్రస్తావిస్తూ ‘‘ ఫిబ్రవరి 8న జరగబోయే పోటీలో దిల్లీ వీధుల్లో భారత్‌-పాక్‌ ఢీ కొంటాయి’’ అని మిశ్రా ట్వీట్ చేశారు. దిల్లీ శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌, భాజపా ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో నిలిచాయి.

కపిల్‌ మిశ్రా మోడల్‌ టౌన్‌ నియోజవర్గం నుంచి భాజపా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆప్‌ ప్రత్యర్థి, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిలేశ్‌పాటి త్రిపాఠిపై ఆయన  పోటీ చేస్తున్నారు. గతంలో కపిల్ మిశ్రా ఆప్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిపదవి కూడా చేపట్టారు. అయితే కొన్ని రాజకీయ కారణాలవల్ల 2017లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆయన్ను పార్టీ నుంచి తొలగించారు. అనంతరం 2019లో మిశ్రా భాజపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని