గణతంత్ర వేడుకల్లో మహిళా బైకర్ల విన్యాసాలు

ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత కనులవిందు చేయనున్నాయి. జనవరి 26న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 65మంది మహిళా బైకర్లు అబ్బురపరిచే విన్యాసాలు...

Published : 24 Jan 2020 01:03 IST

దిల్లీ‌: ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత కనులవిందు చేయనున్నాయి. జనవరి 26న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 65మంది మహిళా బైకర్లు అబ్బురపరిచే విన్యాసాలు చేయనున్నారు. ఇందుకోసం 350సీసీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ వాహనాలను వాడనున్నారు. దిల్లీలోని రాజ్‌పథ్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే వేడుకల్లో వీరంతా పాల్గొంటారు. గణతంత్ర వేడుకల్లో మహిళా బైకర్లు పాల్గొనడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌ 31న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఇదే మహిళా బృందం విన్యాసాలు చేసింది. 2015లో ఆర్మీ, నావికా, వైమానిక దళ విభాగాలకు చెందిన మహిళలు పరేడ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత 2018లో బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)కు చెందిన మహిళలు పరేడ్‌ నిర్వహించారు. అయితే, ఈ సారి సీఆర్పీఎఫ్‌ మహిళలకు మాత్రమే అవకాశం దక్కిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందరూ 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వారేనని పేర్కొన్నారు. కాగా ఈ సారి ద్విచక్రవాహనాల మీద విన్యాసాలు చేయనుండటం ప్రత్యేకాకర్షణగా నిలువనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని