నిరసన ప్రజాస్వామ్య లక్షణం: ప్రణబ్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను మరింత పటిష్ఠం చేస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.........

Published : 24 Jan 2020 11:58 IST

దిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను మరింత పటిష్ఠం చేస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. వాదోపవాదాలు, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య లక్షణాలని వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి చేసిన ప్రయత్నాల్ని పదే పదే మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో నియంతృత్వ ధోరణి క్రమంగా పాతుకుపోతుందని వివరించారు. గత కొన్ని నెలలుగా ప్రజలు ముఖ్యంగా యువత తమ భావాలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. దిల్లీలో జరిగిన భారత తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ సంస్మరణ సభలో గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలిచిందని ప్రణబ్‌ గుర్తుచేశారు. 

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), ఎన్‌ఆర్‌పీ తదితర అంశాలపై గత కొంత కాలంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రణబ్‌ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని