దావోస్‌లో మోదీపై బిలియనీర్‌ విమర్శలు

దావోస్‌: భారత ప్రధాని నరేంద్రమోదీపై బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ తీవ్ర విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆయన మాట్లాడుతూ భారత్‌, ట్రంప్‌ గురించి తీవ్ర విమర్శలు చేశారు. 

Published : 25 Jan 2020 00:41 IST

దావోస్‌: భారత ప్రధాని నరేంద్రమోదీపై బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ తీవ్ర విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆయన మాట్లాడుతూ భారత్‌, ట్రంప్‌ గురించి తీవ్ర విమర్శలు చేశారు. 

‘జాతీయవాదం తిరగబడుతోంది. భారత్‌లో పరిస్థితులు భయపెట్టే విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నరేంద్రమోదీ భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌పై శిక్షాత్మకమైన నిబంధనలను విధిస్తున్నారు. కొన్ని వేల మంది ముస్లింల పౌరసత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా-చైనా సంబంధాలపైనా ఆయన మాట్లాడుతూ డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ తన స్వలాభం కోసం జాతి ప్రయోజనాలను కూడా పణంగా పెట్టే వ్యక్తి అని ఆరోపించారు. ఎన్నికల్లో మళ్లీ  గెలవడానికి ఆయన ఏమైనా చేస్తారని అన్నారు. ట్రంప్‌ బలహీనతను ఉపయోగించుకొని జిన్‌పింగ్‌ కృత్రిమ మేధస్సు ద్వారా యూఎస్‌ ప్రజలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఎదురుచూస్తున్నారని ఆరోపణలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు