సీఏఏ, ఎన్ఆర్సీపై సంతకాల ఉద్యమం
తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే నిర్ణయం
చెన్నై: ఎన్ఆర్సీ, పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ చట్టసవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా డీఎంకే, దాని మిత్రపక్షాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. డీఎంకే నేతృత్వంలో ఫిబ్రవరిలో భారీస్థాయిలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధినేత స్టాలిన్ వెల్లడించారు. శుక్రవారం చెన్నైలో డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే నేతలు సమావేశమై దీనిపై చర్చించారు. సీఏఏను ఉపసంహరించుకోవడంతో పాటు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ప్రక్రియలను తమిళనాడులో నిర్వహించకూడదన్నారు. దీనికి సంబంధించి ఓ తీర్మానాన్ని కూడా రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్టు స్టాలిన్ తెలిపారు. అనంతరం ఈ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేయనున్నట్టు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
TSRTC: ఆర్టీసీకి భారీ గి‘రాఖీ’.. రికార్డు స్థాయిలో వసూళ్లు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!