దిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ...

Updated : 26 Jan 2020 11:00 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సొనారో   హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని