మునుపెన్నడూ చూడని సూర్యుడిని చూస్తారా..

ఏంటీ మండే అగ్నిగోళాన్ని దగ్గర్నుంచి చూడటమా.. అసలు సాధ్యమయ్యే పనా? అనేగా మీ సందేహం. అది అసాధ్యమే.. అయితే సూర్యుడి ఉపరితలం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఖగోళ శాస్త్రవేత్తలు.

Updated : 30 Jan 2020 12:07 IST

హవాయి(యూఎస్‌): ఏంటీ మండే అగ్నిగోళాన్ని దగ్గర్నుంచి చూడటమా.. అసలు సాధ్యమయ్యే పనా? అనేగా మీ సందేహం. అయితే ప్రపంచంలోనే అతిపెద్దదైన సోలార్‌ టెలిస్కోప్‌ సూర్యుడి ఉపరితలానికి సంబంధించితన తొలి చిత్రాన్ని తీసింది. మన సూర్యుడికి సంబంధించి ఇప్పటివరకూ అత్యధిక రిజల్యూషన్‌ కలిగిన చిత్రం ఇదే కావడం విశేషం. 

అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌) తమ పరిశోధనల్లో భాగంగా సూర్యుడి ఉపరితలం ఫొటోలను చిత్రీకరించింది. హవాయిలోని డేనియల్‌ కె. ఇనోయి సోలార్‌ టెలీస్కోప్‌ ద్వారా ఈ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇందులో సూర్యుడి ఉపరితలంపై ఉండే ప్లాస్మా బంగారు వర్ణంలో భగభగ మండుతూ కన్పించింది. ఈ ఫొటోలను నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘ఇంతకుముందు ఎన్నడూ చూడని సూర్యుడిని చూడండి..! సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన స్పష్టమైన చిత్రం ఇది’ అని ఎన్‌ఎస్ఎఫ్‌ పేర్కొంది. ఈ చిత్రాలతో సూర్యుడిని మరింత అర్థం చేసుకునేందుకు, భూమిపై దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు వీలు లభించినట్లయిందని వెల్లడించింది. ఇంకేం.. మండుతున్న అగ్నిగోళాన్ని మీరూ ఓసారి చూసేయండి..!

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని