‘కరోనా’తో త్రిపుర వ్యక్తి మృతి

చైనాలో విజృంభించిన ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’ కారణంగా భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపుర వాసి మనీర్‌ హొస్సేన్‌ కరోనా

Published : 30 Jan 2020 13:18 IST

మలేషియాలో చనిపోయినట్లు చెప్పిన కుటుంబసభ్యులు

అగర్తలా: చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’ కారణంగా భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపుర వాసి మనీర్‌ హొస్సేన్‌ కరోనా వైరస్‌తో చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. 

త్రిపురలోని పురాతల్‌ రాజ్‌నగర్‌ గ్రామానికి చెందిన మనీర్‌ హొస్సేన్‌ ఉపాధి నిమిత్తం 2018లో మలేషియా వెళ్లాడు. అక్కడే ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మనీర్‌.. చికిత్స పొందుతూ మృతిచెందాడని ఆయన తాత అబ్దుల్‌ రహీమ్‌ మీడియాకు తెలిపారు. ‘బుధవారం ఉదయం మలేషియా అధికారుల నుంచి మాకు ఫోన్‌ వచ్చింది. మనీర్‌ కరోనా వైరస్‌ వల్ల చనిపోయినట్లు వారు చెప్పారు’ అని రహీమ్‌ చెప్పారు.

అయితే దీన్ని భారత అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ ధ్రువీకరిస్తే కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన తొలి భారత వ్యక్తి మనీర్‌ అవుతారు. ఈ ప్రాణాంతక వైరస్‌ చైనాలో ఇప్పటికే 170 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ పలు రాష్ట్రాల్లో కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరి నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు.

ఇవీ చదవండి..
170కి చేరిన కరోనా మృతులు
అవనిగడ్డలో కరోనా కలకలం
గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని