కాబోయే భార్య కోసం కాలి నడకన...
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఎంతో అపురూపమైన ఘట్టం. అందులోనూ భారతీయ సమాజంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా ఓ యువకుడు తనకు కాబోయే భార్య కోసం చేసిన పని...
డెహ్రాడూన్: ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఎంతో అపురూపమైన ఘట్టం. అందులోనూ భారతీయ సమాజంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా ఓ యువకుడు తనకు కాబోయే భార్య కోసం చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకొంటోంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో బిజ్రా గ్రామానికి చెందిన యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమయింది. అయితే బ్రిజా గ్రామం కొండ ప్రాంతంలో ఉండటంతో ఆ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేదు. అక్కడికి చేరుకోవాలంటే కాళ్లకు పనిచెప్పాల్సిందే. జనవరి మాసం కావడంతో అక్కడ మంచు కూడా అధికంగా కురుస్తుంది. దీంతో కాలిబాట పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. ముహూర్త సమయానికి వధువు ఇంటికి చేరుకోవడానికి వేరే మార్గం లేకపోవడంతో వరుడు, పెళ్లి బృందం కాలి నడకన కొండలను దాటుకుంటూ నాలుగు కిలోమీటర్లు నడిచి బిజ్రా గ్రామానికి చేరుకున్నారు. ఓ పక్క తీవ్రంగా మంచు కురుస్తున్నపటికీ, ఒక చేత్తో గొడుగును పట్టుకొని పెళ్లి దుస్తుల్లో వరుడు నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలను ప్రముఖ వార్తా ఏజెన్సీ ట్విట్టర్లో ఉంచడంతో అవి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘అత్యుత్తమ వరుడు అవార్డు ఇతనికే’, ‘ఎంత రొమాంటిక్ బంధం’, ‘ప్రేయసి కోసం పాట్లు’ అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా