నేరస్థుడిపై కఠిన చర్యలు తప్పవు: అమిత్‌షా

దిల్లీలోని జామియా వర్శిటీ వద్ద గురువారం చోటుచేసుకున్న కాల్పులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Published : 30 Jan 2020 21:16 IST

దిల్లీ: దిల్లీలోని జామియా వర్శిటీ వద్ద గురువారం చోటుచేసుకున్న కాల్పులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘నేను ఇప్పటికే దిల్లీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడాను. కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇలాంటి ఘటనల్ని ఏ మాత్రం సహించేంది లేదు. నేరస్థులు ఎక్కడికీ తప్పించుకోలేరు’ అని ట్వీట్‌లో వెల్లడించారు 

దిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జామియా వర్శిటీ నుంచి రాజ్‌ఘాట్‌కు కొందరు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో జామియా ప్రాంతంలో ఓ వ్యక్తి ర్యాలీలో పాల్గొన్న వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థికి గాయాలవగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో తమ ర్యాలీకి రక్షణ కల్పించాలని వేలాదిగా విద్యార్థులు ఆ ప్రాంతంలో నిరసనకు దిగారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని