
ఎన్నికలకు భయపడే ఇలా చేస్తున్నారు: ఆప్
దిల్లీ: దిల్లీలో గురువారం చోటుచేసుకున్న కాల్పులకు భాజపాయే కారణమంటూ ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే భాజపా ఇలాంటి చర్యలు పాల్పడుతోంది. అందుకే ఇలాంటి చర్యల ద్వారా ఎన్నికల గడువును పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. భాజపా చర్యల వల్లే పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఆపకుండా మౌనంగా ఉన్నారు’ అని ఆయన భాజపాపై ధ్వజమెత్తారు.
మరోవైపు సీఏఏ వ్యతిరేక నిరసనల్ని ఆమ్ఆద్మీ పార్టీయే ప్రోత్సహిస్తోందని పలువురు భాజపా నాయకులు ఆరోపించారు. షాహిన్‌బాగ్‌లో జరిగిన నిరసనలకు కూడా ఆ పార్టీయే కారణమని నిందిస్తూ.. ఆ ఆందోళనలకు సంబంధించిన ఖర్చులను ఆప్ అభ్యర్థుల ఖర్చు కిందకే వేయాలని వారు ఈసీని కోరారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను, రికార్డులను ఈసీకి సమర్పించినట్లు భాజపా ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ చెప్పారు. ఇలాంటి ఆందోళనలపై ఈసీ దృష్టి సారించాలని వారు కోరారు. ఈసీని కలిసిన వారిలో కేంద్రమంత్రులు హర్షవర్దన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.