గూడ్సు రైళ్లలో ఇకపై ఎస్కార్టులు

గూడ్సు రైళ్లలో మార్గమధ్యంలో సరకు దొంగతనాలు పెచ్చుమీరుతున్న వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చోరీలను నివారించేందుకు గూడ్సు రైళ్లలో ఇకపై ప్రైవేటు ఏజెన్సీలకు...

Published : 31 Jan 2020 23:59 IST

దిల్లీ: గూడ్సు రైళ్లలో మార్గమధ్యంలో సరకు దొంగతనాలు పెచ్చుమీరుతున్న వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చోరీలను నివారించేందుకు గూడ్సు రైళ్లలో ఇకపై ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన సాయుధులైన రక్షకుల (ఎస్కార్టులు)ను నియమించుకోనుంది. తొలి విడతగా తూర్పు రైల్వే జోన్‌లో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్షించి, ఇతర రైల్వే జోన్లలో ప్రవేశ పెట్టాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 29 ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సరకులతో వెళుతున్న గూడ్సు రైళ్లలో చోరీలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని