పార్లమెంటులో సీఏఏపై చర్చకు విపక్షాల పట్టు

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా విపక్షసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.............

Updated : 03 Feb 2020 14:12 IST

దిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా విపక్షసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సేవ్‌ డెమొక్రసీ-సేవ్‌ ఇండియా అంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. సీఏఏ, ఎన్‌ఈర్‌సీపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో వామపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యుల నిరసనల నేపథ్యంలో ఛైర్మన్‌ రాజ్యసభను మధ్నాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్‌, టీఎంసీ సహా మరికొన్ని పార్టీలు సీఏఏపై చర్చ కోసం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని