సీఏఏ తర్వాత అసోంకు తొలిసారి మోదీ

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రవేశపెట్టిన అనంతరం తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ అసోం పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 7న అసోంకు వెళ్లనున్న మోదీ కోక్రజర్‌ పట్టణంలో బోడోలకు సంబంధించిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Published : 04 Feb 2020 00:35 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రవేశపెట్టిన అనంతరం తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ అసోం పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 7న అసోంకు వెళ్లనున్న మోదీ బోడోల ప్రాబల్యం ఉన్న కోక్రజర్‌ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బోడో తీవ్రవాద బృందాలు, విద్యార్థి సంఘాలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ పర్యటన జరుగుతుండటం విశేషం. గత వారం జరిగిన బోడో అభివృద్ధి ఒప్పందం అనంతరం 1500 మంది తీవ్రవాదులు లొంగిపోయారు. కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల కారణంగా గతనెలలో అసోంలో నిర్వహించిన ఖేలో ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ప్రధాని హాజరుకాలేదు. అంతేకాకుండా డిసెంబర్లో ఉండాల్సిన జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన కూడా రద్దయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని