గంజాయి చట్టబద్ధం చేయాలి: నేపాల్‌ ఎంపీలు

దేశంలో గంజాయి పండించడాన్ని చట్టబద్ధం చేయాలని నేపాల్‌ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎంపీలు కోరారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ తీర్మానం....

Published : 04 Feb 2020 00:32 IST

కాఠ్‌మాండూ: దేశంలో గంజాయి పండించడాన్ని చట్టబద్ధం చేయాలని నేపాల్‌ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎంపీలు కోరారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం దిగుమతిని నిషేధించాలనీ డిమాండ్‌ చేశారు. 1973 నుంచి గంజాయి పండించడం, ఉత్పత్తి, వ్యాపారంపై నేపాల్‌లో నిషేధం అమల్లో ఉంది.

నేపాల్‌లోని మక్వాన్‌పూర్‌ జిల్లాలో భారీ స్థాయిలో అక్రమంగా గంజాయిని పండిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎంపీ బిరోద్‌ ఖతివాడా ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీనికి 45 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. అమెరికా, కెనడా, జర్మనీ వంటి 65 దేశాలు 1970లో నిషేధం విధించినప్పటికీ వాటిపై నిషేధం ఎత్తివేశాయని గుర్తు చేశారు. గంజాయిని చట్టబద్ధం చేయడం వల్ల దేశానికి ఆదాయం సమకూరుతుందని, దీనివల్ల ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ కూడా సమకూరుతుందని తెలిపారు. అయితే, దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి గోకుల్‌ బస్కోటా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని