కూరగాయలతో హృదయం పదిలం!

హృదయం, రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించేందుకు శాకాహారం ఎంతగానో దోహదపడుతుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తుల్లో సల్ఫర్‌ అమైనో ఆమ్లాల శాతం తక్కువగా ఉండటమే...

Published : 03 Feb 2020 23:40 IST

వాషింగ్టన్‌: హృదయం, రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించేందుకు శాకాహారం ఎంతగానో దోహదపడుతుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తుల్లో సల్ఫర్‌ అమైనో ఆమ్లాల శాతం తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిర్ధారించింది. సాధారణంగా అమైనో ఆమ్లాల కలయికతో ప్రోటీన్లు ఏర్పడతాయి. ఈ అమైనో ఆమ్లాల్లో మిథియోనైన్, క్రిస్టీన్‌ వంటి సల్ఫర్‌ అమైనో ఆమ్లాలు సహా భిన్నరకాలుంటాయి. మాంసం, పాల ఉత్పత్తులతో పోలిస్తే కూరగాయల్లో సల్ఫర్‌ అమైనో ఆమ్లాల శాతం తక్కువ. ఈ ఆమ్లాలను తక్కువగా ఆరగించేవారిలో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతున్నట్లు 11 వేల మందిపై ప్రత్యేక అధ్యయనం ద్వారా అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని