
అమెరికాలో కాల్పులు: ఇద్దరి మృతి
టెక్సాస్: టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్ ఏఅండ్‌ఎం వర్సిటీలో ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అయితే వారు విద్యార్థులా.. కాదా.. అన్నది చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. మరో చిన్నారికి గాయాలుకాగా ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తే కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్‌ఎం వర్సిటీలో సుమారు 1600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీ గదుల్లోనే ఉండాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.