వయసు ఏడాది.. గెలిచింది ₹7 కోట్లు!

నిండా ఏడాది వయస్సు కూడా లేని ఓ కేరళ చిన్నారి మిల్లెనియం మిలియనీర్‌ల జాబితాలోకి చేరిపోయాడు.

Published : 05 Feb 2020 23:09 IST

దుబాయి: నిండా ఏడాది వయసు కూడా లేని ఓ కేరళ చిన్నారి లక్కీడ్రాలో జాక్‌పాట్‌ కొట్టేసింది. దాదాపు రూ.7 కోట్లు గెలుచుకుంది. ‘దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిల్లెనియం మిలియనీర్‌’ పేరిట నిర్వహించిన డ్రాలో ఈ మొత్తం గెలుచుకుంది. మొహమ్మద్ సలాహ్‌ అనే 11 నెలల అబ్బాయి ఈ లాటరీ గెలుచుకున్నాడు. దీంతో ఒక మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.7 కోట్లు)కు పైగా అతడి సొంతమయ్యాయి. ‘‘ఈ టికెట్‌ను నేను నా కొడుకు పేరు మీద కొన్నాను. వాడు చాలా అదృష్టవంతుడు. వాడి జీవితం చాలా మంచి శకునంతో మొదలయింది. మాకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టిన దేవతలకు కృతజ్ఞతలు. ఇది భారీ బహుమతి. ఈ డబ్బుతో నేనింకా ఏం చేయాలో నిర్ణయించుకోలేదు’’ అని సలాహ్‌ తండ్రి రమీజ్‌ రహ్మాన్‌ చెప్పుకొచ్చారు. కేరళకు చెందిన వీరు అబుదాబీలో గత ఆరేళ్లుగా నివసిస్తున్నారు. దుబాయి డ్యూటీ ఫ్రీ సంబరాల్లో ఏడాదిగా పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 13 నాటికి ఈ చిన్నారికి ఏడాది నిండుతుంది.

ఇదీ చదవండి

భారతీయులు రోజుకు రూ.1200 చెల్లించాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని