ఎన్‌పీఆర్‌లో ఆధార్‌ వెల్లడి స్వచ్ఛందమే: కేంద్రం

దిల్లీ: జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌) నమోదు సమయంలో ఆధార్‌ నెంబరును వెల్లడించడం స్వచ్చందమే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ తెలియజేశారు. ఆధార్‌ డేటాతో జాతీయ జనాభా పట్టిక సమాచారాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం ఉందా  అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

Published : 06 Feb 2020 00:27 IST

దిల్లీ: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నమోదు సమయంలో ఆధార్‌ నెంబరును వెల్లడించడం స్వచ్ఛందమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఆధార్‌ డేటాతో జాతీయ జనాభా పట్టిక సమాచారాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

అసోం మినహా దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జనాభా పట్టిక తయారీ, నవీణీకరణ కొనసాగుతుందని రాయ్‌ తెలిపారు. దేశంలోని ప్రతి గ్రామం, పట్టణంలో నివసిస్తున్న అందరి వివరాలను ఆ పట్టికలో నమోదు చేస్తామన్నారు. ఆ సమయంలో ఆధార్‌ నెంబరు వెల్లడించాలా? వద్దా? అనే విషయం పౌరుల అభీష్టం మాత్రమే అని స్పష్టంచేశారు. పౌరసత్వ చట్టం-1955 ప్రకారం 2003లో రూపొందించిన పౌరసత్వ నిబంధనల్లోని రూల్‌ 3లోని సబ్‌రూల్‌(4) అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

అంతేగాకుండా బంగ్లాదేశ్‌ నుంచి భారత్ వచ్చి.. వీసా గడువు ముగిసిన అనంతరం కూడా ఇక్కడే నివసిస్తున్న వారి సంఖ్యను నిత్యానంద రాయ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. 2017లో 25,942, 2018లో 49,645, 2018లో 35,055 మంది వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడే నివసిస్తున్నారని నిత్యానంద రాయ్‌ లోక్‌సభలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని