అక్షయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ

నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం తిరస్కరించారు. గత శనివారం మరో దోషి వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన గంటల వ్యవధిలోనే అక్షయ్‌ కూడా దాఖలు చేసుకున్నాడు.

Updated : 05 Feb 2020 21:49 IST

దిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం తిరస్కరించారు. గత శనివారం మరో దోషి వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన గంటల వ్యవధిలోనే అక్షయ్‌ కూడా క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో వారికి ఫిబ్రవరి 1న విధించాల్సిన ఉరిశిక్ష అమలును దిల్లీ న్యాయస్థానం నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉరి అమలుపై స్టే విధించింది.

దీంతో ప్రత్యేక కోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు నలుగురు దోషుల్ని వేర్వేరుగా ఉరితీయడం కుదరదని తేల్చి చెబుతూ పిటిషన్‌ను ఇవాళ కొట్టి వేసింది. అయితే దోషులు వారంలోగా తమకున్న న్యాయ పరమైన అవకాశాల్ని వినియోగించుకోవాలంటూ స్పష్టంచేసింది. దీంతో కేంద్రం దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని