వెల్లుల్లి, నువ్వుల నూనె.. కరోనాకు పనిచేయవు

వెల్లుల్లి రసంతో ‘కరోనా’ నయం కాదని తేటతెల్లమైంది. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు.. నువ్వుల నూనె, మౌత్‌ వాష్‌ల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు

Published : 06 Feb 2020 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెల్లుల్లి రసంతో ‘కరోనా’ నయం కాదని తేటతెల్లమైంది. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు.. నువ్వుల నూనె, మౌత్‌ వాష్‌ల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు ‘కరోనా చికిత్స’పై వస్తున్న పుకార్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కొట్టిపారేసింది. 

ఓ వైపు రోజురోజుకీ కరోనా తీవ్ర రూపం దాలుస్తుండగా.. మరోవైపు వదంతులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. వెల్లుల్లి రసం, నువ్వుల నూనె, మౌత్‌ వాష్‌ల వల్ల కరోనా తగ్గుతుందంటూ పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని డబ్ల్యూహెచ్ఓ తాజాగా స్పష్టం చేసింది. ‘వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే.. మౌత్‌ వాష్‌ల వల్ల నోటికి తాజాదనం లభిస్తుంది. అంతేగానీ ఇవి కరోనా నుంచి రక్షించవు’ అని చెబుతూ వదంతులను కొట్టిపారేసింది. తప్పుడు సమాచారాలపై డబ్ల్యూహెచ్‌ఓ వెబ్‌సైట్లో స్పష్టతనిచ్చింది. 

మౌత్‌వాష్‌లు కరోనా సోకకుండా కాపాడుతాయనడంలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. నువ్వుల నూనెను శరీరమంతా రాసుకుంటే కరోనా వైరస్‌ను చంపేస్తుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. యాంటీబయోటిక్స్‌, హెర్బల్‌ టీ, సీ విటమిన్‌ను తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. ‘ఇప్పటివరకు కరోనా వైరస్‌ నుంచి రక్షించే కచ్చితమైన మెడిసిన్‌ ఏదీ రాలేదు. అయితే కరోనా సోకిన రోగుల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ క్లినికల్‌ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చికిత్సలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలకు డబ్ల్యూహెచ్‌ఓ కూడా తమవంతు సహకారం అందిస్తోంది. కరోనా చికిత్సలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) ఇండియా తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. 

కరోనా వదంతులపై డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టమైన సమాచారం కోసం క్లిక్‌ చేయండి 

ఇవీ చదవండి..

చైనా పౌరులారా.. భారత్‌కు రావొద్దు

560కి చేరిన కరోనా మృతులు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని