కరోనా ఎఫెక్ట్‌: సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

చైనాలో ఉనికిలోకి వచ్చిన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత సైన్యం చైనా, నేపాల్‌ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే వారి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలున్నందున భద్రతను...

Published : 07 Feb 2020 00:45 IST

పుణె: చైనాలో ఉనికిలోకి వచ్చిన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత సైన్యం చైనా, నేపాల్‌ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే వారి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలున్నందున భద్రతను పెంచి అప్రమత్తం చేసినట్లు భారత సాయిధ బలగాల వైద్య సేవలు (ఏఎఫ్‌ఎంఎస్‌) డైరెక్టర్ జనరల్‌ అనూప్‌ బెనర్జీ తెలిపారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌తో సహా వివిధ రకాల వ్యాధికారక నమూనాలను పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. పుణెలోని సాయుధ బలగాల వైద్య కళాశాల వద్ద మాట్లాడిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

‘చైనా, నేపాల్‌ సరిహద్దుల ద్వారా వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సరిహద్దుల్లో ఉన్న కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. చైనాలోని వుహాన్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన భారతీయులకు ఐటీబీపీ, భారత సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. రకరకాల వ్యాధికారక వైరస్‌లపై పరిశోధన చేసేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. అవసరమైతే కరోనా వైరస్‌ నమూనాలను సైతం ఇక్కడ పరీక్షించేందుకు వీలుంటుంది’ అని ఏఎఫ్‌ఎంఎస్‌ డైరెక్టర్ జనరల్‌  తెలిపారు.

ప్రస్తుతం పుణెలో ఉన్నటువంటి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ, దిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా వైరస్‌ నమూనాలను పరీక్షిస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి 563 మందికి పైగా చనిపోగా, 28,018 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

ఏమిటి ఈవైరస్‌ ?

వెల్లుల్లి, నువ్వుల నూనె.. కరోనాకు పనిచేయవు

చైనా పౌరులారా.. భారత్‌కు రావొద్దు

చైనాలో 560కి చేరినా కరోనా మృతులు

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని