ఒమర్‌, ముఫ్తీలపై పీఎస్‌ఏ!

జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మహబూబాముఫ్తీలపై కేంద్ర హోంశాఖ ప్రజా భద్రత చట్టాన్ని(పీఎస్‌ఏ) ప్రయోగించినట్లు తెలుస్తోంది.

Published : 06 Feb 2020 23:41 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీలపై కేంద్ర హోంశాఖ.. ప్రజా భద్రత చట్టాన్ని(పీఎస్‌ఏ) ప్రయోగించినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి కేంద్రం ఎన్‌సీ నేత ఒమర్‌ అబ్దుల్లాను, పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీని నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 5 నుంచి దాదాపు ఆరు నెలలుగా వారు నిర్బంధంలోనే ఉన్నారు. వారితో పాటు ఇంకా పలువురు నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకున్నప్పటికీ.. కొందరిని బాండ్లపై సంతకాలు తీసుకుని విడుదల చేశారు. తాజాగా ఒమర్‌ అబ్దుల్లా, మహబూబాముఫ్తీలపై పీఎస్‌ఏ ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ రోజు లోక్‌సభలో ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులను చర్చిస్తూ.. ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో ఒమర్‌, ముఫ్తీలు అనుచిత ప్రసంగాలు చేసినట్లు పేర్కొన్నారు. లోక్‌సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే వారిపై ఈ చట్టం ప్రయోగించడం గమనార్హం. ఈ చట్టం ప్రకారం కింద విచారణ లేకుండా మూడు నెలల పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు. గతంలో ఫరూక్‌ అబ్దుల్లాపై ఈ చట్టాన్ని ప్రయోగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు