172 మంది ఉన్న విమానాన్ని కూల్చబోయారు..!

మాస్కో: సిరియాకు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సిరియా దళాలు పొరపాటున ప్రయాణికుల విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా రెప్పపాటులో తప్పించుకొని అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Published : 07 Feb 2020 17:40 IST

మాస్కో: సిరియాకు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సిరియా దళాలు పొరపాటున ప్రయాణికుల విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా రెప్పపాటులో తప్పించుకొని అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

సిరియాకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ-320 టెహ్రాన్‌ నుంచి 172 మంది ప్రయాణికులతో డమాస్కస్‌కు రావాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్‌ జెట్‌ ఫైటర్స్‌పై దాడి చేసే క్రమంలో పొరపాటున సొంత విమానాన్నే సిరియా రక్షణ దళాలు కూల్చేందుకు ప్రయత్నించాయి. కానీ, ఈ ప్రమాదం నుంచి విమానం త్రుటిలో తప్పించుకొని రష్యా ఆధీనంలో ఉన్న ఖెమిమ్‌ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఇజ్రాయెల్‌ జెట్‌ ఫైటర్స్‌ సిరియా గగనతలంలోకి రానివ్వకుండా చేసేందుకు సిరియా దళాలు దాడులు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌కు చెందిన ప్రయాణికుల విమానం టెహ్రాన్‌ నుంచి వస్తుండగా ఇరాన్‌ దళాలు పొరపాటున కూల్చేసిన విషయం తెలిసిందే. 

అమెరికా-ఇరాన్‌ మధ్య సంక్షోభం తలెత్తిన సమయంలో ఈ ఘటన జరిగింది. టెహ్రాన్‌ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు బయల్దేరిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ ఘటనలో 176 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. తొలుత ఇది ప్రమాదమని వార్తలు వచ్చాయి.. కానీ ఇరాన్‌ దళాలు పొరపాటున క్షిపణిని ప్రయోగించడం వల్లే విమానం కూలిపోయినట్లు తేలింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని