దిల్లీ ఎన్నికలు: మందకొడిగా పోలింగ్‌

దిల్లీ: ఓ వైపు ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎలాగైనా దిల్లీ గద్దెనెక్కాలని భాజపా ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్‌ ఎదురుచూస్తోంది.

Published : 08 Feb 2020 16:08 IST

దిల్లీ: ఓ వైపు ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎలాగైనా దిల్లీ గద్దెనెక్కాలని భాజపా ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్‌ ఎదురుచూస్తోంది. కానీ దిల్లీ ఓటర్లు ఆలోచన మాత్రం భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2015తో పోల్చుకుంటే ఈ ఏడాది ఓటింగ్‌ సరళి చాలా తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఈ దఫా మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు.

మరో రెండు గంటల్లో పోలింగ్‌ ముగియనుంది. కానీ పోలింగ్‌ శాతం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయానికి 40.18శాతం మాత్రమే పోలింగ్‌ శాతం నమోదైంది. 
మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 28శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే.. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 42 శాతం పోలింగ్‌ నమోదై రికార్డు సృష్టించింది. సాయంత్రం 6గంటలకు పోలింగ్‌ ముగియనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెలువడనున్నాయి.  మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా..1.47కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని