Published : 10 Feb 2020 00:45 IST

కరోనా బాధితులు ఏదేశంలో ఎంతమంది?

బీజింగ్‌: చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దాదాపు 25 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,500 పైగా వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. అత్యధికంగా చైనాలో  దీని దాటికి 811 మంది మరణించగా.. 37,198 మంది ఇంకా దీని కోరల్లో ఉన్నారు. హాంగ్‌కాంగ్‌లో 25 కేసులు నమోదు కాగా.. ఒకరు మరణించారు. దేశాల వారీగా దీని బారిన పడిన వారి వివరాలు చూసుకుంటే.. జపాన్‌లో 96, సింగపూర్‌లో 40, థాయ్‌లాండ్‌లో 32, దక్షిణకొరియాలో 25, తైవాన్‌లో 16, మలేషియాలో 16, ఆస్ట్రేలియా 14, జర్మనీ 14, వియత్నాం 14, యూఎస్‌ 12, ఫ్రాన్స్‌ 11, యూఏఈ 7, కెనడా 6, ఫిలిప్పీన్స్‌ 3 (1మృతి), ఇండియా 3, ఇటలీ 3, యూకే 3, రష్యా 2, బెల్జియం 1, నేపాల్‌ 1, శ్రీలంక 1, స్వీడన్‌ 1, స్పెయిన్‌ 1, కంబోడియా 1, ఫిన్‌లాండ్‌ 1 ఇంతమంది ప్రస్తుతం కరోనా బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

యూఏఈలో మరో రెండు కొత్త కేసులు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ యూఏఈలో తాజాగా మరో ఇద్దరికి సోకింది. యూఏఈలో ఇప్పటికే ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కొత్తగా మరో ఇద్దరికి గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఏడుకు చేరినట్లు తెలిపింది. ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకారం.. సాధారణ తనిఖీ పరీక్షల ద్వారా తమ దేశంలో రెండు కొత్త కరోనా కేసులను గుర్తించినట్లు వెల్లడించింది. ఆ ఇద్దరిలో ఒకరు చైనా జాతీయుడు కాగా.. మరొకరు.. ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు కావడం గమనార్హం. గతవారంలో వుహాన్‌కు చెందిన నలుగురు కుటుంబసభ్యులతో పాటు, మరో వ్యక్తికి నిర్దారించినట్లు చెప్పింది.

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts