ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?:కేజ్రీవాల్‌

దిల్లీ శాసనసభా ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ పర్సంటేజీ ప్రకటించకపోవడంపై ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం విచారం వ్యక్తం చేశారు. పోలింగ్‌ ముగిసి గంటలు గడుస్తున్నా తుది పోలింగ్‌ పర్సంటేజీని ప్రకటించకపోవడం ఏంటని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.

Updated : 09 Feb 2020 18:18 IST

దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ పర్సంటేజీ ప్రకటించకపోవడంపై ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం విచారం వ్యక్తం చేశారు. పోలింగ్‌ ముగిసి గంటలు గడుస్తున్నా తుది పోలింగ్‌ పర్సంటేజీని ప్రకటించకపోవడం ఏంటని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘ఎంతో షాకింగ్‌గా ఉంది. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది. ఎన్నికలు ముగిసి గంటలు కావస్తున్నా ఇప్పటివరకు పోలింగ్‌ తుది పర్సంటేజీని ఎందుకు ప్రకటించడం లేదు’ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

దిల్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం 6గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. 1.47కోట్ల మంది ఓటర్లకు గానూ ఎంత మంది పాల్గొన్నారో ఈసీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. సాధారణంగా ఆ వివరాలు ఎన్నికలు ముగిసిన సాయంత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం అధికారులు శనివారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఓటింగ్‌ 61.43శాతంగా నమోదయినట్లు వెల్లడించారు. కానీ ఇంకా తుది జాబితా వెల్లడించలేదు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని