ఒమర్‌ అబ్దుల్లా అరెస్టుపై సుప్రీంలో సవాల్‌..!

జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను ప్రజా భద్రత చట్టం(పీఎస్‌ఏ) కింద నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ  ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్‌ సుప్రీం కోర్టు ఆశ్రయించారు.......

Published : 10 Feb 2020 14:25 IST

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను ప్రజా భద్రత చట్టం(పీఎస్‌ఏ) కింద నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్‌ సుప్రీం కోర్టు ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలన్న ఆమె అభ్యర్థనను సోమవారం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అరెస్టు వల్ల అబ్దుల్లా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ అబ్దుల్లా అరెస్టును సవాల్‌ చేస్తూ హెబియస్‌ కార్పస్‌ పిటిసన్‌ను దాఖలు చేశామని వెల్లడించారు. ఈ వారంలో దీనిపై విచారణ జరపాలని కోరామన్నారు.

జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాపై కఠినమైన ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఆగస్టు 5న జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి వీరిద్దరితో సహా అనేక మంది నేతలు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇటీవల అధికారులు వీరిపై పీఎస్‌ఏను ప్రయోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని