ఆమె కరోనా నుంచి బయటపడిందట!

భారత్‌లో మొదట కరోనా సోకిన కేరళకు చెందిన మహిళ నెమ్మదిగా ఆ విషమహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన తాజా పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలినట్లు కేరళ వైద్యాధికారులు సోమవారం తెలిపారు.

Published : 11 Feb 2020 00:38 IST

కొచ్చి: భారత్‌లో మొదట కరోనా సోకిన కేరళకు చెందిన మహిళ నెమ్మదిగా ఆ విషమహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన తాజా పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలినట్లు కేరళ వైద్యాధికారులు సోమవారం తెలిపారు. సీనియర్‌ వైద్యాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలోని వుహాన్‌ నగరం నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళకు జనవరి 10న పరీక్షలు నిర్వహించిగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమె రక్త నమూనాలను  జాతీయ వైరాలజీ విభాగానికి(ఎన్‌ఐవీ) పంపగా.. కరోనా నెగెటివ్‌గా వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పుణెలోని ఎన్‌ఐవీ నుంచి వచ్చే రిపోర్టు కోసం వేచిచూస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం మీద 3వేలకు పైగా వ్యక్తుల్ని పరిశీలనలో ఉంచినట్లు.. అంతేకాకుండా మరో 34 మందిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచినట్లు చెప్పారు.  ఈమె భారత్‌లో మొదట కరోనా సోకిన మహిళ కావడం గమనార్హం. కాగా చైనాలో దీని బారిన పడి ఇప్పటి వరకు 908 మంది మరణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని